ఫన్ బకెట్ ద్వారా అందరికీ పరిచయమైన భార్గవ్ ను యాంకర్స్ శివ వివాదంలోకి నెట్టాడు.

ఇటీవల కాలంలో యూట్యూబ్ మరియు టిక్ టాక్ స్టార్ లు వరుసగా వివాదాలకు గురవుతున్నారు. ఇటీవల యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసి అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా ఫన్ బకెట్ భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు యూట్యూబ్ యాంకర్ శివ పోస్ట్ చేశారు. నిజంగా భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారా..? లేదంటే శివ చెప్పే విషయాలు అబద్ధమా..? ఒకవేళ యాంకర్ శివ చెప్పింది అబద్ధమైతే, ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు ఖచ్చితంగా పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు.

యాంకర్ శివ తన ఇన్స్టాగ్రామ్ వీడియోల ద్వారా చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఫన్ బకెట్ భార్గవ్ ను అండర్ దిశా యాక్ట్ క్రింద పోలీసులు అరెస్టు చేయబోతున్నారు. నేను ఆ వీడియో తీయడానికి వెళ్తున్న అంటూ వీడియోలు విడుదల చేశారు.

ఇప్పుడు ఆ వీడియోలో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇదేమైనా ప్రాంక్ అని నెటిజన్లు అడగగా దానికి యాంకర్ శివ నిజాలు చెప్తే ప్రాంక్ అంటారు ఏంట్రా నాయనా నేను ఎందుకు ఫ్రాంక్ చేస్తా..
భార్గవ్ ఎవరో ఒక అమ్మాయిని మోసం చేసాడంట ఒరిజినల్ వీడియో ను పేస్ బుక్ లో మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశా, కానీ పోలీసులు వాళ్ళ ఫేసెస్ కనిపిస్తున్నాయి అని డిలీట్ చేయమన్నారు. రేపు పోలీసులు ఈ విషయాన్ని ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తారంటూ యాంకర్ శివ చెప్పుకొచ్చారు. మరి యాంకర్ శివ చెప్పిన విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది.

x