Gali Sampath Telugu Movie Review
గాలి సంపత్ కథ విషయానికి వస్తే గాలి సంపత్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు నటించారు. ఒక ఆక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన గొంతు పోతుంది. దాని తర్వాత నుంచి ఆయన ఏం మాట్లాడినా సరే ఫ.. ఫ.. ఫి.. ఫె.. అని వస్తుంది. కాకపోతే ఆ డైలాగులు ట్రాన్సలేట్ చేయడానికి సత్య ఉంటాడు సినిమా అంతా.
ఇక తన కొడుకు సూరి (శ్రీ విష్ణు) ఒక ట్రక్ డ్రైవర్. అరకులో ట్రక్ నడిపే అతను ఒక సొంత ట్రక్ కొనుక్కొని సెటిల్ అవుదామనుకుంటాడు. కాని సూరి లైఫ్ లో గాలి సంపత్ చేసే పనుల వల్ల ఎప్పుడు ఇబ్బందులే. సూరి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ట్రక్ కొనాలని డబ్బులు కూడా కూడబెట్టుకుంటాడు.
కానీ గాలి సంపత్ కి కొడుకు గురించి వేరే ప్లాన్స్ ఉన్నాయి. దాని వల్ల సూరి లైఫ్ లో ఏం ఇబ్బందులు వచ్చాయి? గాలి సంపత్ ఏం అయ్యారు? ఇంతకీ గాలి సంపత్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేదే కథ. మూవీకి మెయిన్ పిల్లర్ రాజేంద్ర ప్రసాద్. టైటిలే రోల్ కదా అందుకే మూవీ అంతా తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ తో నడుస్తుంది. మూవీ కి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం పర్యవేక్షణ చేశారు అనిల్ రావిపూడి గారు.
అయితే కథలో కామెడీ ఎలా ఉంటుందో తెలుసుగా, లాజిక్స్ పక్కన పెట్టేస్తే ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. క్యారెక్టర్స్ ని మరియు సెటప్ ని మొదటి 15 నిమిషాల్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు డైరెక్టర్ గారు. అలా మెల్లగా కామెడీ మరియు లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతాయి. ఈ లవ్ ట్రాక్ ఇప్పటికే మనం ఎన్నో మూవీస్ లో చూసాం. కానీ అందులో కూడా కామెడీ ఎక్సపెక్ట్ చెయ్యచ్చు.
కామెడీ అంటే మరీ పడి పడి నవ్వుతారు అని అనను, అక్కడక్కడ నవ్వుతారని మాత్రం చెప్పగలను. మరీ ముఖ్యంగా సత్య పంచెస్ బాగా ల్యాండ్ అయ్యాయని చెప్పచ్చు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తాన్ని రాజేంద్రప్రసాద్ క్యారీ చేస్తారు. ఆయన జీవితంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
కానీ సెకండ్ ఆఫ్ ఆ బేస్ ని అంత తొందరగా అందుకోలేదు. మూవీ టీమ్ అంతా సెకండ్ ఆఫ్ త్రిల్లర్ మోడ్ లో ఉంటది అని చెప్పుకుంటూ వచ్చారు. అందులోకి మారడానికి కొంచెం సమయం పడుతుంది. కథలో కొంచెం ఏ ప్రోగ్రెస్ ఉండదు. కానీ అక్కడ ఉన్నది ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు మెల్లగా ప్రోగ్రెస్ అవ్వడం మొదలయ్యాక మన అటెన్షన్ గ్రాఫ్ చేస్తారు. కొన్ని సీన్స్ లో మాత్రం అదే ఎమోషన్ మళ్లి మళ్లి చూస్తున్నాం అనే ఫీల్ వస్తది గాని, అది తప్పితే క్లైమాక్స్ పోర్షన్ బాగుంది.
రాజేంద్ర ప్రసాద్ గారి నటన:
రాజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టోరీ మొత్తం డైలాగ్స్ లేకుండ కేవలం హావ భావాలతో ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు ఎమోషనల్ సీన్స్ మరియు కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని ఏ యాక్టర్ పడితే ఆ యాక్టర్ చేయలేరు రాజేంద్ర ప్రసాద్ తప్ప. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే తోపు ఉంటది.
హీరో (శ్రీ విష్ణు) నటన:
కొడుకు పాత్రలో ఒదిగి పోయాడు. ఎమోషనల్ సీన్స్ లో రాజేంద్రప్రసాద్ గారితో సమానంగా పని చేయడం అంటే మామూలు విషయమా! యాక్టర్ గా మంచి రోల్స్ ఎంచుకుంటున్నాడు.
ఇతరుల నటన:
హీరోయిన్ లవ్లీ సింగ్ నటన విషయానికొస్తే, లవ్ సీన్స్ కొత్తగా ఏమీ ఉండవు. ఎక్కడో చూసామే అన్నట్టు ఉండటం వల్ల హీరోయిన్ పెర్ఫామెన్స్ చాలా నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సత్య రోల్ చాలా బాగుంది. ఈ మధ్య ఏ రోల్ చేసిన వంద శాతం ఇస్తున్నాడు. అలాగే ఈ మూవీ కి కూడా అంతే ఎక్కడ తగ్గలా. తనికెళ్ల భరణి గారు అద్భుతంగా నటించారు.
టెక్నికల్:
అచ్చు రాజమణి ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. అలాగే బి జి ఎం కూడా మూవీ కి పీర్ఫెక్ట్ గా సెట్ అయింది. విజువల్స్ ని చక్కగా ఇచ్చారు సాయి శ్రీరామ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్టర్ అన్నీష్ కృష్ణ విషయానికి వస్తే అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ మరియు కామెడీ సీన్స్ ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
రాజేంద్రప్రసాద్ లాంటి యాక్టర్ ని ఎలా యూజ్ చేసుకోవాలో తనకి బాగా తెలుసు. అదే తనకు ఉన్న ప్లస్ పాయింట్. అనిల్ రావిపూడి ఇచ్చిన స్క్రీన్ ప్లే ఫ్రెష్ ఏమి అనిపించలా. కొన్ని ప్లేసెస్ లో ఫ్లాట్ గా అనిపించింది. కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారు పెరఫార్మెన్సు తో డామినేట్ చేసి పారేసారు. మూవీ అయితే చూడచ్చు. కానీ ఏదో కొత్తది చూస్తాం అని ఎక్స్ పెక్ట్ చెయ్యొద్దు. కుటుంబంతో చూడదగ్గ సినిమానే. వెళ్లి చూడండి.