సంక్రాంతి పండుగ సందర్బంగా కృష్ణాజిల్లా గుడివాడ కు కూడా గోవా కల్చర్ పాకింది. గుడివాడ కే – కన్వెన్షన్ ప్రాంగణంలో జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక రాజకీయ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందులు వేస్తున్నారు.

ఒకవైపు కోడి పందాలు, పేకాట శిబిరాలు మరోవైపు గుండాట, తీన్ పత్తి, మూడు ముక్కలాటతో తో పాటు కొత్తగా క్యాసినో ను కూడా ఏర్పాటు చేశారు. పది వేలు ఎంట్రీ ఫీజు చెల్లిస్తేనే క్యాసినో కి ఎంట్రీ దొరుకుతుంది. మొత్తానికి లోపల ఏర్పాట్లు చూస్తుంటే గోవాను తలపించేలా కనిపించాయి.

ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. స్పెషల్ గా క్రీడా కారుల్లో జోష్ నింపేందుకు చీర్ గర్ల్స్ ను కూడా ఏర్పాటు చేయించారు. ప్రత్యేక లైటింగ్ తో ఓ వేదికను ఏర్పాటు చేసి దానిపై చీర్ గర్ల్స్ తో నృత్య ప్రదర్శనలు చేయిస్తున్నారు. క్యాసినో లోపల ఏం జరుగుతుందో చిత్రీకరించకుండా బౌన్సర్ లను కూడా నియమించారు.

x