బుల్లితెర డాన్స్ రియాలిటీ షో లో ‘ఢీ’ ఒక స్పెషల్ కేటగిరి ని సొంతం చేసుకుంది. ఢీ షో లో డాన్స్ మాత్రమే కాదు, టీం మేట్స్ చేసే అల్లరి, సుధీర్ రేష్మి మ్యాజికల్ కెమిస్ట్రీ, హైపర్ ఆది పంచులు, ప్రియమణి మరియు పూర్ణా గ్లామర్ ఈ షో కి మరింత రెట్టింపు అందాన్ని తీసుకు వచ్చింది.

డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇండియన్ నుంచి క్లాస్, క్లాస్ నుంచి మాస్ ఇక ఇంటర్నేషనల్ డాన్స్ కూడా ఇక్కడ పరిచయం చేశారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఈ షో నుంచే వచ్చారంటే దీని క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. ఇప్పుడు తాజాగా అందులో శేఖర్ మాస్టర్ ప్లేస్ లో ఒక గెస్ట్ వచ్చారు ఆయనే గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.

పవన్ కళ్యాణ్ గారికి చాలా సినిమాల్లో సిగ్నేచర్ స్టెప్స్ కొరియోగ్రఫీ చేసినది కూడా గణేష్ మాస్టరే. పవన్ కళ్యాణ్ గారిని గణేష్ మాస్టర్ దైవంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబుతారో, గణేశ్ మాస్టర్ ఈసారి షో లో అది చేసి చూపించారు. అది ఏమిటంటే సాయి అనే కొరియోగ్రాఫర్ తన టీం మేట్స్ ఇద్దరికీ ఒక అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ చేయించారు. ఆ డాన్స్ తో ప్రేక్షకులను మాత్రమే కాదు అక్కడ ఉన్న జడ్జెస్ అందర్నీ కూడా కంటతడి పెట్టించేశారు.

ఒక మెంటల్ ఛాలెంజ్ పీపుల్ కు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుందో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ రూపంలో చూపించారు. ఆ సాంగ్ పర్ఫామెన్స్ పూర్తిన తర్వాత అందరూ ఎమోషనల్ అయ్యి చప్పట్లు కొట్టారు. అప్పుడు సాయి తన లైఫ్ లో జరిగిన విషయాన్ని అక్కడ చెప్పాడు. సాయి తన జీవితంలో తన తండ్రిని కోల్పోయాడని, తన తల్లి పెంచడానికి ఎన్నో కష్టాలు పడుతుందని వాళ్లకు ఉన్న అప్పులు భరించలేక ఆమె ఇంట్లో దాక్కొని అప్పల వారికి కనబడకుండా సాయిని ఇంట్లో లేనని చెప్పించేదని చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిచ్చువేషన్ లో గణేష్ మాస్టర్ సాయి తో ఇలా అన్నారు. నీకు ఎంత అప్పు ఉందని అడిగితే సాయి నాలుగు లక్షల అప్పు ఉందన్నారు.

గణేష్ మాస్టర్ మరో మాట మాట్లాడకుండా, ఇంకొక ఆలోచన చేయకుండా షో అయిపోయిన వెంటనే నా దగ్గరకు రా.. ఆ నాలుగు లక్షలు నేను ఇస్తాను. మీ అప్పులు తీర్చుకొని తల్లి ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఆ ఒక్క మాటతో మొత్తం స్టేజ్ అంత నిలబడి గణేష్ మాస్టర్ కు చప్పట్లు కొట్టారు. అప్పుడు హైపర్ ఆది ఇలా అన్నారు ‘మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అని మాకు తెలుసు, కానీ ఈ ఒక్క విషయంలో మీరు మాకు పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తున్నారు’ అని హైపర్ ఆది చెప్పారు.

గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయన చేసేదే నేను ఇప్పుడు చూపించాను, అంటే పెద్దగా తేడా ఏమీ లేదు ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. నిజంగా కూడా ఆయన లైఫ్లో అలాగే ఉంటారు. మేమందరం కూడా ఇలా మారటానికి పవన్ కళ్యాణ్ గారే కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న తన అభిమానాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉండటం మాకు అలవాటు అయిపోయింది, అయన నేర్పించిన విలువలను మేము ఎప్పటికీ మర్చిపోలేము అంటూ ఎమోషనల్ అయ్యారు గణేష్ మాస్టర్.

x