తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ‘నగేష్‌ కుమార్‌’ దర్శకత్వం వహించారు. అయితే, తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ ను విడుదల చేశారు.

సినిమా విషయానికి వస్తే, “ఊరు జనం మొత్తం కీర్తిసురేష్‌ ను బ్యాడ్‌ లక్‌ సఖి అంటూ పిలుస్తూ ఉంటారు. అయితే, ఆది పినిశెట్టి సాయం తో తను జగపతిబాబు దగ్గర షూటర్ గా శిక్షణ తీసుకుంటుంది. చివరికి తను షార్ప్ షూటర్ గా ఎలా మారింది.. ఊరు జనంతో ‘గుడ్‌ లక్‌ సఖి’ అని ఎలా పిలిపించుకుంది” అనేదే సినిమా కథ.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దిల్‌ రాజ్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని సుధీర్‌ చంద్ర నిర్మించారు. శ్రావ్యావర్మ సహా నిర్మాతగా వ్యవహరించారు.

x