ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పై కరోనా కలకలం రేపుతుంది. భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ20 వాయిదా పడింది. దీంతో ఇరుజట్లు ఐసోలేషన్ కి వెళ్లారు. టీమ్ ఇండియా, శ్రీలంక ఆటగాళ్లు అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగెటివ్ అని తేలితేనే ఈ రోజు మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంటుందని ప్రకటించారు.

ఈ కరోనా ఎఫెక్ట్ తో ఇంగ్లండ్ టూర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే శుబ్‌మాన్‌ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ వంటి యువ ఫేసర్లు గాయాల బారిన పడటంతో.. శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా ను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ శ్రీలంక టూర్ లో ఉన్నారు. వీరికి కోవిడ్ నెగెటివ్ వస్తేనే ఇంగ్లండ్ కు వెళ్లే అవకాశం ఉంది.

కానీ, తాజాగా పృథ్వీషా, సూర్యకుమార్ తో పాటు.. కృనాల్ పాండ్యా కు సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ప్లేయర్ల కు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా వారందరికీ నెగటివ్ వచ్చిందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. దీంతో బుధవారం మ్యాచ్ కు కృనాల్ పాండ్యా తప్ప మిగిలిన వాళ్ళు అందరు అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం కృనాల్ పాండ్యా జట్టు నుంచి దూరం కావడంతో.. దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వీరిద్దరిలో ఎవరో ఒకరికి అతని స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

x