దేశంలోనే అతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అయిన ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండేన్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఒక అద్భుతమైన స్కీమ్ గురించి తెలియజేసింది. దీనివల్ల సింగల్ సిలిండర్ ఉపయోగించుకునే వారికీ ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇండేన్ గ్యాస్ కంపెనీ ” కాంబో డబల్ బాటిల్ కలెక్షన్ ఆన్ స్కీమ్” ను అందిస్తుంది.

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ఈ స్కీమ్ కింద 14.2 కేజీల సిలిండర్ తో పాటు, 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల గ్యాస్ సడన్గా అయిపోతే ఇబ్బంది పడాల్సిన పనిలేదు. 14.2 కేజీల సిలిండర్ మార్చేసి 5 కేజీల సిలిండర్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డబల్ కలెక్షన్ కి సంబంధించిన వివరాల కోసం మీరు మీ డిస్ట్రిబ్యూటర్స్ ని సంప్రదించాలని ఇండేన్ గ్యాస్ తెలిపింది. ఈ విషయాని ఇండేన్ ఆయిల్ ట్విట్టర్ వేదికగా ఈ డబల్ బాటిల్ కనెక్షన్ గురించి తెలిపింది.

x