సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెల్పింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలంటూ ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 61 ఏళ్ల కు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సింగరేణి సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ, మార్చి 31 నుంచి జూన్ 30 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.
అంతేగాక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 2021-22 సంవత్సరానికి సీయస్ఆర్ పనులకోసం 60 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నస్పూర్ కాలనీ వద్ద హైవే నిర్వహితులకు సింగరేణి కాలనీ లో ప్లాట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలోని అన్ని ఉద్యోగాలకు లింగ వివక్ష లేకుండా అవకాశం కల్పిస్తామన్నారు.