కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను వణికిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ వైరస్ వల్ల చాలా మంది పిల్లలు అనాధలయ్యారు. ఈ తరుణంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మన ముందుకు వచ్చింది. దీంతో ఈ కొత్త వేరియంట్ వల్ల ఏం నష్టం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.

అయితే, ఈ క్రమంలో ఐసీఎంఆర్ (ICMR) అధ్యయనం ఓ శుభ వార్త తెల్పింది. ఓమిక్రన్ వేరియంట్ వల్ల పేషెంట్ లో ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు, డెల్టా వేరియంట్ తో సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుందని తెలిపింది. ఓమిక్రాన్ సోకిన వ్యక్తి లో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుందని ఈ అధ్యయనంలో తేలింది. కరోనా వేరియంట్ అయిన డెల్టా యొక్క తీవ్రతను దీని వల్ల అరికట్టవచ్చు అని వారు చెప్తున్నారు.

 

x