నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నట్లు మనకు తెలుసు. బాలకృష్ణ ఈ సినిమా కోసం భారీ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుండి ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నరు. క్రాక్ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్న గోపీచంద్ మలినేని అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ ను తదుపరి స్థాయికి తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాడు. ఈ సినిమాలో బాలయ్య బాబు పోలీస్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని ఈ మధ్యనే ఓ వార్త సోషల్ మీడియా లో హాల్ చల్ అవుతుంది. అతి త్వరలో ఈ చిత్రంలోని హీరోయిన్లు మరియు నటీనటుల వివరాలను చిత్రబృందం ప్రకటించనున్నారు.

x