గోపీచంద్‌ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా, సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీటీమార్‌’. ప్రస్తుతం థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాను వినాయక చవతి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో గోపీచంద్ కార్తీక్ సుబ్రహ్మణ్యం పాత్రలో ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా, తమన్నా జ్వాలా రెడ్డి పాత్రలో తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా నటించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ, మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ సినిమాలో భూమిక చావ్లా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు మొదలైన వారు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

x