తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో కొత్త యూపీఎస్‌ యూనిట్ ఏర్పాటు కారణంగా రేపు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్ సైట్ లకు అంతరాయం కలగనుంది.ఆ రెండు రోజులు పాటు ప్రభుత్వ ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. దీని కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ కావు.

ప్రస్తుతం కేంద్రం ద్వారా ప్రభుత్వ వెబ్సైట్ల ఆన్లైన్ సేవలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సేవలు వినియోగం పెరగడంతో యూపీఎస్‌ కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌ యూనిట్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచాలని నిపుణులు సూచించారు.

దీనికి అనుగుణంగా కొత్త యూపీఎస్‌ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఏర్పడే అంతరాయాల గురించి అన్ని శాఖలకు ప్రభుత్వం సమాచారం అందించండి.

x