జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి (23) వీర మరణం పొందారు. ఆయన జన్మస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామం. జమ్మూ కాశ్మీర్‌లో ముష్కరులను హతమార్చేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహించారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి జమ్ము కాశ్మీర్ రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్ లో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందారు. అందులో ఒకరు గుంటూరు జిల్లా, బాపట్ల మండలం కు చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి.
ఐదేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరిన జశ్వంత్‌కు త్వరలోనే వివాహం చేయాలని తల్లితండ్రులు భావించారు. కానీ, ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జశ్వంత్ రెడ్డి తో పాటు మరో జవాన్ ‘నాయబ్ శ్రీజిత్’ కూడా ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.