సగం కుక్క-సగంపులి తిరిగొచ్చిన అంతరించిన జీవి

ప్రస్తుతం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఎన్నో రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. కొన్ని జాతులు అంతరించి పోవడానికి చివరి దశలో ఉన్నాయి. వీటిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు అయితే తాజాగా అంతరించిపోయందనుకున్న ఒక జంతువు మళ్లీ కనిపించింది.

ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం అంటే సుమారు 85 ఏళ్ల క్రితం అంతరించిపోయందనుకున్న ఈ అరుదైన వింత జంతువు అక్కడ స్థానిక ప్రజలకు కనిపించి మళ్లీ కనువిందు చేసింది. ఇది చూడటానికి సగం కుక్క సగం పులి లా ఉంటుంది. ఆస్ట్రేలియా లోని తాస్మానియా ప్రాంత ప్రజలు 85 ఏళ్ల క్రితం అంతరించిపోయిన వింత జీవి తాస్మానియా టైగర్ ను చూశామని చెబుతున్నారు.

అయితే ఇది గత 8.5 దశాబ్దాలుగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ కనిపించడంతో తాస్మానియా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇన్ని దశాబ్దాలుగా కనిపించకుండా పోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అది అంతరించి పోయిందని 1936 లో అధికారికంగా ప్రకటించింది. మొత్తం మీద అంతరించిపోయందనుకున్న జంతువు తిరిగి కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

image source

x