దర్శకుడు శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో పరిశ్రమకు కొంతమంది కొత్త నటులను పరిచయం చేశాడు. వారిలో రాహుల్ దయాకిరణ్ ఒకరు. హ్యాపీ డేస్ సినిమాలో అతను సన్నగా కనిపించాడు. సినిమాలో అతను పేరు టైసన్. అతను చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. హ్యాపీ డేస్ విడుదలైన తర్వాత నటుడికి సరైన అవకాశాలు రాలేదు. అయితే, అతను ఇప్పుడు తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేశాడు.

నటుడు తనను తాను మార్చుకోవడానికి ఎంతో కృషి చేశాడు. తన రాబోయే చిత్రం కోసం, కఠినమైన ఆహారం మరియు వ్యాయామ నియమాన్ని అనుసరించడం ద్వారా రాహుల్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. రాహుల్ తన తాజా చిత్రాలలో ప్రేక్షకులు గుర్తించలేనంతగా మారిపోయాడు.

“కష్టతరమైన ప్రారంభాని ఎప్పుడు వదులుకోవద్దు”, “ఈ రోజు మిమల్ని భాదించిన రేపు మాత్రం బలోపేతం చేస్తుంది” అని రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫోటో పోస్ట్ కింద ఇది రాశాడు.

Happy Days actor Rahul who changed the whole look.

వెంకటపురం సినిమా తరువాత, రాహుల్ స్వల్ప విరామం తీసుకున్నాడు మరియు ఇప్పుడు రెండు చిత్రాలతో తిరిగి వస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఆయన రాబోయే చిత్రానికి 100 కోట్లు అనే టైటిల్ పెట్టారు.

x