ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కు గా ఉన్న జియోనా చనా శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. మిజోరంకి చెందిన జియోనా చనా వయసు 76 ఏళ్ల. చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్ళు,మనవరాళ్లూ ఉన్నారు. నివేదికల ప్రకారం, ఆయన అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఆయన చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 7 నుండి జియోనా చనా అనారోగ్యంతో భాదపడుతున్నాడు. అతను ఆకలిని కూడా కోల్పోయాడు మరియు ఏమీ తినలేకపోయాడు. జూన్ 11 న అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే ఆయ్‌జోల్‌లోని ట్రినిటీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మూడింటికి కన్నుమూశారు. అతను డయాబెటిస్ మరియు అధిక రక్తపోటుతో కూడా భాదపడుతున్నారు.

జియోనా చనా జూలై 21, 1945 లో జన్మించాడు. అతను మొదటిసారి 17 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య అతని కంటే మూడు సంవత్సరాలు పెద్దది. ఆ తర్వాత 37 మందిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పెద్ద కుటుంబం 100 గదులున్న 4 అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. అతనికి పెద్ద కుటుంబం ఉన్నందున చనా గ్రామం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారింది.

మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ భారమైన హృదయంతో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ” మీ కుటుంబం కారణంగానే మీ గ్రామం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారింది. మీ ఆత్మకు శాంతి కలగాలి” అని ఆయన ట్వీట్‌ చేశారు.

x