హీరో ఆది సైకుమార్ నటించిన చివరి చిత్రం శశి. ఇప్పుడు ఆది సాయికుమార్ ఇంకో సినిమా తీయబోతున్నాడు. తాజాగా మొదలుపెట్టిన చిత్రం “అమరన్” ఈ చిత్రానికి ఎస్ బాలవీర్ గారు దర్శకత్వం వహించనున్నారు, ఈ సినిమాను జెమినీ స్టూడియో సమర్పణలో ఎస్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు.
ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ఖర్చు చెస్తున్నారు.ఈ సినిమా లో అవికా గౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో సాయికుమార్ గారు, హీరో హీరోయిన్ పై ముహూర్తపు షాట్ ను క్లాప్ ఇచ్చారు.
సిటీ ఫిల్మ్ సిరీస్‌లో అమరన్, ‘ఇన్ ది సిటీ-చాప్టర్ 1’ గా ప్రారంభం కానుంది. అధిక సాంకేతిక విలువలతో ఈ చిత్రం ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో హీరో ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎం.సతీష్ ఛాయాగ్రాహకుడిగా మరియు కృష్ణ చైతన్య సంగీత స్వరాలు అందిస్తున్నాడు.