సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న హీరో, హీరోయిన్స్ విడాకులు తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొగా ఈ విషయం మరచిపోకముందే, తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ధనుష్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, ఐశ్వర్య ఇంస్టాగ్రామ్ ద్వారా ఇదే విషయాన్ని ధృవీకరించింది.

ధనుష్ తన లేఖలో 18 ఏళ్ల పాటు మేము స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులు గా ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించమని ధనుష్ అన్నాడు. మా జర్నీ అర్థం చేసుకోవటం, సర్దుకుపోవడం అలా సాగిపోయిందని అయితే, ప్రస్తుతం తాము వేరు వేరు దారుల్లో నిలబడి ఉన్నామని దంపతులుగా విడిపోతేనే మంచిదని నిర్ణయించుకున్నట్లు ధనుష్ వెల్లడించారు. దయచేసి తమ నిర్ణయాన్ని గౌరవించాలని లేఖలో కోరాడు. ఈ విషయం పట్ల తమకు అవసరమైన ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమశ్శివాయ స్ప్రెడ్ లవ్ అంటూ ధనుష్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

2004 లో హీరో ధనుష్ ఐశ్వర్య హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం సంచలనంగా మారిన సూచి లీక్స్ ఉదంతంలో ధనుష్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తుంది.

హీరో ధనుష్ తమిళ డైరెక్టర్, నిర్మాత ‘కస్తూరి రాజా’ కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ధనుష్ కు అన్నయ్య. కొద్ధి కాలంలోనే ధనుష్ పాపులర్ హీరో అయ్యాడు. ‘వై దిస్ కొలవరి’ పాటతో హీరోగా ధనుష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఐశ్వర్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు. ఆమె కోలీవుడ్లో దర్శకురాలిగా కొనసాగుతోంది.

ఐశ్వర్య 2012లో ధనుష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా 3 కి దర్శకత్వం వహించింది. పదేళ్ల క్రితమే యూట్యూబ్ ని షేక్ చేసిన ‘వై దిస్ కొలవరి’ సాంగ్ ఈ సినిమాలోదే. ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ హీరో గా ‘వై రాజా వై’ సినిమాకు కూడా దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో ధనుష్ అతిధి పాత్రలో కన్పించారు. ఏది ఏమైనా 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడం అనే విషయం ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది.

x