తమిళ హీరో కార్తీక్ చివరిగా నటించిన సినిమా సుల్తాన్. హీరో కార్తీక్ కొత్త సినిమాకు సైన్ చేశాడు. ఆ సినిమా పేరు కార్తీ సర్దార్. ఈ సినిమాకు పి స్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసింది. ఈ నెల 26 న షూట్ ప్రారంభించబోతున్నారు.

రాశి ఖన్నా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. సర్దార్ లో కార్తీక్ మరియు పి స్ మిత్రన్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

కార్తీ తన ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు మరియు ఇలా వ్రాశారు, “ఈ బిగ్గీలో పి స్ మిత్రన్ తో చేతులు కలపడం ఆనందంగా ఉంది. మీ అందరి కోసం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాము అని అన్నాడు.

కార్తీతో పాటు రాశి ఖన్నా, రజిషా విజయన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జార్జ్ సి విలియమ్స్ ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు. కె. ఖదీర్ ఆర్ట్ డైరెక్టర్. ధలీప్ సుబ్బారాయణ్ స్టంట్ డైరెక్టర్. ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్ర నిర్మాత మరియు పిఎస్ మిత్రాన్ ఈ చిత్ర దర్శకుడు.

x