2008 లో, ముంబైలో జరిగిన 26/11 దాడుల సమయంలో బందీలను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన NSG కమాండ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితానికి స్ఫూర్తిగా ఈ “మేజర్” సినిమాను తీశారు. ఆదివి శేష్ ఈ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మేజర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.

ఈ చిత్రం టీజర్‌ను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వరుసగా మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేయనున్నారు.

హీరో నాని మేజర్ టీజర్‌ గురించి మాట్లాడుతూ, మేజర్ టీజర్ చూశానని తెలియజేస్తూ అంచనాలను పెంచుతున్నాడు. చాలా కాలం తర్వాత నేను చుసిన “ది బెస్ట్ టీజర్” అంతూ తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకువచ్చాడు.

శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభితా ధులిపాల, మంజ్రేకర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు.

x