హీరో నిఖిల్ ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకొని ఒక ప్రత్యేకమైన హీరో గా తనను తాను మార్చుకున్నాడు. నిఖిల్ నుంచి చివరిగా వచ్చిన సినిమా అర్జున్ సురవరం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నిఖిల్ నుంచి కొత్తగా 18 పేజీల ప్రీ-లుక్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో నిఖిల్ అద్భుతంగా కనిపించాడు. ఈ పోస్టర్లో నిఖిల్ సిగిరెట్ తాగుతూ, ఒక పేపర్ ను కాలుస్తూ కనిపించాడు. పోస్టర్ ను చూస్తుంటే సినిమా పై అంచనాలు మరింత పెంచేలా కనిపిస్తుంది.
జూన్ 1 న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెప్పారు. ఇప్పుడు విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ దాన్ని ఊహించే విదంగా ఉంటుంది.
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.