టాలీవుడ్ హీరోయిన్ నైరా షా ను ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కాని, ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో, ఎన్సీబీ అధికారులు జుహూలోని ఒక హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. అక్కడ నైరా షా పుట్టినరోజు పార్టీ జరుపుకుంది. పార్టీలో నైరా షా తన స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ తో కలిసి గంజాయిని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు వారిద్దరిని ఐపీసీ సెక్షన్ 274 కింద అరెస్టు చేశారు. తనిఖీల్లో ఎన్సీబీ అధికారులు సిగరెట్లలో చుట్టబడి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు తర్వాత నైరా ను మరియు ఆమె స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. మీడియా నివేదికల ప్రకారం, నిందితులు నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. దీని తరువాత వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సోమవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘బుర్ర కథ’ చిత్రంతో పాటు ‘ఇఈ’ అనే చిత్రంలోను నటించింది.