ఆనందయ్య మందుపై ఉత్కంఠ తొలిగింది. కృష్ణ పట్టణానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సి సి ఆర్ ఏ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే చుక్కల మందు కు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఆనందయ్య కంటి చుక్కల మందు అనుమతి పై తదుపరి విచారణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

ఆనందయ్య తయారుచేసే ‘కె’ అనే మందుకు అనుమతి లభించకపోవడానికి శాంపిల్ ఇవ్వకపోవడమే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాధి వాదించారు. శాంపిల్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆనందయ్య తరపు న్యాయవాది చెప్పారు. అలాగే మందు పంపిణీకి కావాల్సిన వనమూలికల విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరారు. అయితే ఈ ఆయుర్వేద మందు వాడిన మిగతామందులు వాడకుండా ఉండకూడదని ప్రభుత్వం సూచించింది. ఆనందయ్య ఇచ్చే పి ఎల్ ఎఫ్ మందులు వాడొచ్చని ప్రభుత్వం సూచించింది.

x