విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా “లిగర్” ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా కి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. జాకీచాన్ లాంటి యాక్షన్ స్టార్స్ సినిమాకు పనిచేసిన ఆండీ లాంగ్ విజయ సినిమాకు వర్క్ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కోసం విజయదేవరకొండ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. ఈ లిగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విశురెడ్డి, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ లిగర్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రం రాబోయే షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది.