ఒక పక్క కరోనా కేసులు ఎక్కువగా పెరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో పక్క ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బుల కోసం రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరి మనస్సులను కలిచివేస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యంతో కరోనా బాధితురాలు ఆస్పత్రి గేటు బయటే ప్రాణాలు విడిచింది.
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజా మండలం, పెంటగ్రహాలం గ్రామానికి చెందిన అంజలి అనే వృద్ధురాలు కోవిడ్ బారిన పడి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు “జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్” కు తీసుకువెళ్లారు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది డబ్బు చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటామని తేల్చిచెప్పారు.
సరేనని ఆన్లైన్ పేమెంట్ చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పారు, అయినా వైద్యులు నిరాకరించారు డబ్బులు బై హ్యాండ్ ఇస్తేనే అడ్మిట్ చేసుకుంటామని అన్నారు. డబ్బు కోసం రోగి బంధువులు రెండు గంటల పాటు ఏటీఎం చుట్టూ తిరిగారు. ఏటీఎంలో ఎక్కడ డబ్బులు దొరకలేదు.
దీంతో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఏటీఎంలు తిరిగి వచ్చేటప్పటికి బాధితురాలు అంజలి రోడ్డుపైన ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.