మలయాళ చిత్ర పరిశ్రమ లో తాజాగా వచ్చిన ‘హృదయం’ అనే సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ‘ప్రణవ్ మోహన్ లాల్’ హీరోగా నటించారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, దీనికి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమా విడుదలకు ముందే మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ కావడం తో ఈ సినిమా పై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాను మేరీ ల్యాండ్ సినిమాస్, బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ కథానాయికలుగా నటించారు. అజు వర్గీస్, జోజో జోస్, ప్రశాంత్ నాయర్, విజయరాఘవన్, అరుణ్ కురియన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఓ యువకుడు తన జీవితంలో వివిధ దశల్లో చేసే ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇది ముఖ్యంగా యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నివేదికల ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 3 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతుందేమో చూడాలి. ఇంతకు ముందు మోహన్ లాల్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘మరక్కార్’ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ ఒక ముఖ్యపాత్రను పోషించాడు. ఈ సినిమాలో అతను చిన్నప్పటి మోహన్ లాల్ గా కనిపించాడు.

ఈ మధ్యకాలంలో తెలుగు నిర్మాతలు సూపర్ హిట్ మలయాళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కప్పెల, నాయట్టు, అయ్యప్పనుమ్ కోషియుమ్ వంటి సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఏ నిర్మాతా ఈ హక్కులను దక్కించుకుంటారు అనేది చూడాలి.

x