భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ ఇ-కామర్స్ కంపెనీల్లో ‘మైంట్రా’ ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ నటులు అయినా హృతిక్ రోషన్, కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ, సమంతా అక్కినేని మరియు దుల్కర్ సల్మాన్ లతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ ఐదుగురు ప్రస్తుతం మైంట్రా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండనున్నారు. ఈ విషయాన్ని మైంట్రా చాలా డిఫరెంట్ గా వెల్లడించింది.
అది ఎలా అంటే, నిన్న సాయంత్రం హృతిక్ రోషన్ తన సింగిల్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇది ఎలా ఉందంటూ కియారాను ట్యాగ్ చేశారు.
వెంటనే ఈ పోస్ట్ కు రియాక్ట్ అయిన కియారా అద్వానీ, సరిపోదు అంటూ.. హృతిక్ ఫోటో పక్కన తన ఫోటోను యాడ్ చేసి ఇది బెటర్ అనుకుంటా! అని ఈ ఫోటోను తన ట్విటర్ ఖాతా లో పోస్ట్ చేస్తూ.. నువ్వు ఏమంటావ్ విజయ్ అంటూ విజయ్ ను ట్యాగ్ చేసింది.
ఇది చూస్తన్నా నెటిజెన్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.. ముగ్గురు కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా అని అనుకున్నారు. కానీ, ఆ పోస్ట్ అక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ కూడా అలానే చేశాడు. ఫోటో చూడటానికి అందంగా ఉంది కానీ, సరిపోదు దీనికి రౌడీనెస్ తగ్గిందంటూ.. తన ఫోటోను యాడ్ చేసి దీనిపై స్పందించాలంటూ సమంతను ట్యాగ్ చేశాడు.
వెంటనే సమంత తన ఫోటోని జోడించి, ఇంకా ఏదో తగ్గింది.. కానీ, దాన్ని ఎలా బెటర్ చేయాలో నాకు తెలుసు అంటూ.. దుల్కర్ ఇది మీరు చేయగలరా? అని దుల్కర్ ను ట్యాగ్ చేసింది.
చివరగా, దుల్కర్ సల్మాన్ తన ఫోటోను కూడా యాడ్ చేసి ఇలా వ్రాశాడు, “దీన్ని తగినంత కంటే ఎక్కువ చేయడానికి ఏమి అవసరమో నాకు తెలుసు.. అంటూ మైంట్రా ను ట్యాగ్ చేశాడు.
చివరికి, మైంట్రా “ఇండియన్ ఫ్యాషన్ ఐకాన్స్” అంటూ హృతిక్, కియారా, విజయ్ దేవరకొండ, సమంత & దుల్కర్ సల్మాన్ ఉన్న చిత్రాన్ని విడుదల చేస్తూ.. “అవును ఇది సరిపోతుంది” అంటూ అందరిని ఆశ్చర్యపరిచారు.
Proud to be part of the @Myntra Style Fam! #IndiasFashionExpert #Myntra #Ad https://t.co/RO0nXTYEJ5
— Hrithik Roshan (@iHrithik) July 29, 2021