రేపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన కొద్ది సేపతిలోనే, తెలంగాణ రాష్ట్రంలో పలు మద్యం దుకాణాల ముందు భారీ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి.

10 రోజుల వరకు సరిపోయే మద్యం కోసం మందు బాబులు వైన్ షాపులకు పరుగులు పెడుతున్నారు. మద్యం దుకాణాల ముందు భారీగా జనాలు ఉండడంతో వారు సామాజిక దూరం కూడా పాటించడం లేదు.

మద్యం షాపుల వద్ద క్యూలు పెద్దయెత్తున ఉండటంతో పెట్రోలింగ్ వాహనాలు కూడా అక్కడకి వస్తున్నాయి. బూజర్లు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. లాక్డౌన్ వ్యవధిలో ఉదయం 6 నుండి 10 గంటల మధ్య అన్ని సాధారణ కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎన్ని గంటలు వైన్ షాపులు తెరిచి ఉంటాయో అనే దాని పై ఇంకా స్పష్టత తెలియకపోవడంతో, ప్రజలు తమ అభిమాన బ్రాండ్ ఆల్కహాల్ కొనుగోలు చేయడానికి మద్యం దుకాణాలకు తరలి వస్తున్నారు.

image source

x