హైదరాబాద్ నాచారం లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ సాయి అనే యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడు ఆన్లైన్ లోని స్విగ్గీ నుంచి ఒక కేజీ స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాడు. సంపత్ ఆ ఐస్ క్రీమ్ కొంచం మిగిల్చి మిగతాది మొత్తం తినేసాడు. ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికి సంపత్ కు వాంతులు, విరోచనాలు అవ్వటం మొదలయ్యాయి. సంపత్ పరిస్థితి బాగా విషమించడంతో కాసేపటికి అతను ప్రాణాలు కోల్పోయాడు. సంపత్ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు, అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సంపత్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

x