ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు మరియు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్,కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ శాఖల వారు కొన్ని మంచి విషయాలను ప్రచారం చేయడానికి సినిమాకి సంబంధించిన మీమ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

వారు సరైన సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్తానికి సినిమా డైలాగులు మరియు నటీనటుల చిత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవలే TSRTC సోషల్ మీడియా వేదికగా, సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక సినిమా మీమ్స్ ను ఉపయోగించడం ప్రారంభించింది.

ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా వివిధ రకాల మంచి విషయాలను ప్రచారం చేయడానికి సినిమా మీమ్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే, అందులో భాగంగా ప్రజల్లో మాస్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారు పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ముఖానికి డిజిటల్ గా మాస్క్ ను జోడించి, “మాస్క్ వేసుకోవాల్సిందే.. తగ్గేదే లే..” అనే క్యాప్షన్ తో ఆ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

x