జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది తెలంగాణ యాస, భాష, సంస్కృతిని కించపరుస్తూ.. బతుకమ్మని అవమానించారనే నేపథ్యంలో అతని పై సోమవారం నాడు స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతను ఇబ్బందుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఒక స్కిట్ ఆదివారం ప్రసారం చేయబడింది. ఈ స్కిట్ లో ఆర్టిస్టులు బతుకమ్మ పాట ప్రదర్శన ఇచ్చారు.

ఆ స్కిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైపర్ ఆది పై కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే అతన్ని తెలంగాణలో తిరగనివ్వమని వారు హెచ్చరించారు. ఈ సమస్య పై హైపర్ ఆది స్పందిస్తూ, తాను కేవలం ఆ స్కిట్ లో ఆర్టిస్ట్ మాత్రమే అని.. ఆ స్కిట్ తాను రాయలేదని చెప్పాడు.

హైపర్ ఆది ఫేస్ బుక్ ద్వారా క్షమాపణలు తెలియచేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. “ఆంధ్ర, తెలంగాణ అనే భిన్న అభిప్రాయాలు మా షో లో ఉండవని హైపర్ అది చెప్పుకొచ్చాడు. ఆ స్కిట్ పై వచ్చిన ఆరోపణలు మేము కావాలని చేసినవి కావు.. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానం ఉండటం వలనే మేము అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాము. ఆ షో లో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నాను” అంటూ హైపర్ అది ఫేస్ బుక్‌ వీడియో లో చెప్పుకొచ్చాడు.

x