మాస్ హీరో రవితేజ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘రామారావు ఆన్ డ్యూటీ’. రవితేజ ఈ సినిమా లోని కొంత భాగాన్ని పూర్తిచేసి ఇటీవలే ‘ఖిలాడి’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ మూవీ మేకర్స్ సినిమాలోని ఒక ప్రత్యేకమైన పాట కోసం ఇలియానా ను సంప్రదించారు.
ఇలియానా కూడా ఈ పాట చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. రవితేజ ఇలియానా కలిసి కిక్, దేవుడు చేసిన మనుషులు, మరియు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలలో నటించారు. సినీ ఇండస్ట్రీలో ఇలియానాకు మంచి పేరుంది. కానీ, ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా లేదు కాబట్టి ఈ పాటతో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
రామారావు ఆన్ డ్యూటీ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక థ్రిల్లర్ మూవీ. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్ సి.ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.