యాస్ తుఫాన్ వల్ల తూర్పు తీర ప్రాంతానికి ముప్పు ఉంది. నేడు ఇది తుఫానుగా మారి ప్రాంతాలపై విరుచుకు పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యాస్ తుఫాన్ వల్ల ముప్పు ఉన్న ప్రాంతా ప్రజలకు మరియు కోవిడ్ తో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులకు సూచించారు.

ఒకపక్క 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా ప్రాంతల్లోని ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాయి. ఈ అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా పరిమితి చెందుతుందని వాతావరణ శాఖ తెల్పింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి నేడు తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడుతుందని వెల్లడించింది. బుధవారం రోజు ఒరిస్సా మరియు బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదే రోజు సాయంత్రం ఒడిస్సా, బెంగాల్ మధ్య తీరం దాటవచ్చని తెల్పింది.

తెలుగు రాష్ట్రాలపై యాస్ తుఫాన్ ప్రభావం :

యస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా ఉందని వాతావరణ కేంద్రం చెప్పండి. కోస్తా ఆంధ్రా లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో వర్షపు జల్లులు కురుస్తాయని చెప్పింది. తుఫాన్ వల్ల సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నట్లు స్పష్టం చేసింది.

x