సొంత గడ్డపై టీం ఇండియా మరో పరీక్షకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన ఇండియా, ముతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో తలపడనుంది. అయితే ఇప్పటికే 1-1 తో సిరీస్ లో సమూర్జీలుగా నిలిచాయి రెండు జట్టులు.
ఇది పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్. అలాగే అహ్మదాబాదులో కొత్తగా కట్టిన ముతేరా స్టేడియంలో ఆడబోయే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఈ అహ్మదాబాద్ పిచ్ అనేది స్పిన్ మరియు పేస్ రెండిటికి అనుకూలిస్తుంది.
ఈ పిచ్ అయితే చెన్నై పిచ్ ల ఉండే ఛాన్స్ లేదు. దీనితో మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో రెండు మార్పులు చేంజ్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఒక విషయం మాత్రం అందరికి తెలిసిందే, లాస్ట్ మ్యాచులో విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి టీంలోకి వస్తాడు.
బుమ్రా టీంలోకి వస్తే సిరాజ్ ప్లేయింగ్ లెవెల్ నుండి బయటకి వెళ్లిపోయే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటె ఇషాంత్ కు రేపు ఆడిపోయే మ్యాచ్ తన కెరీరులో వందవ టెస్టు మ్యాచ్. అలాగే లాస్ట్ టైం ఇండియాలో బాంగ్లాదేశ్ తో పింక్ బాల్ టెస్ట్ ఆడినపుడు అతను 9 వికెట్స్ పడగొట్టి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు.
కాబట్టి పింక్ బాల్ అనుభవం దృష్ట్యా ఇషాంత్ కచ్చితంగా టీంలో ఉంటాడు. ఇక రెండో చేంజ్ ఏంటీ అంటే, కుల్దీప్ యాదవ్ ప్లేసులో హార్దిక్ పాండ్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె ఇప్పటివరకు 15 పింక్ బాల్ టెస్ట్ మ్యాచులు జరిగితే అందులో ఒక్కటి కూడా డ్రా కాలేదు. అంటే ఒంక్ బాల్ టెస్ట్ అనేది బౌలర్లు గేమ్.
టీం ఇండియా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్ మ్యాన్ తో వెళితే బెటర్ అని నా ఉద్దేశ్యం. ఎక్సట్రా బ్యాట్స్ మ్యాన్ గా టీంకి అవసరమైతే బాలింగ్ కూడా చేసే సత్తా ఉన్న హార్దిక్ పాండ్య అయితే బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మన టీంఇండియా అశ్విన్ మరియు అక్షర్ పటేల్ బ్యాటింగ్ సామర్ధ్యం మీద కాన్ఫిడెంట్ గా ఉంటే మాత్రం, మూడో సీమరుగా సిరాజ్ మరియు ఉమేష్ యాదవ్ ని ఆడిస్తాడు.
ఇదే జరిగితే ప్లేయింగ్ లెవెల్లో పాండ్యకు చోటు దొరక్కపోవచ్చు. మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఒకసారి చూసుకుంటే:
1. రోహిత్ శర్మ
2. షుబ్మాన్ గిల్
3. ఛతేశ్వర పుజారా
4. విరాట్ కోహ్లీ(C)
5. అజింక్య రహనే
6. రిషబ్ పంత్(WK)
7. హార్దిక్ పాండ్య
8. అక్షర్ పటేల్
9. రవి చంద్ర అశ్విన్
10. ఇషాంత్ శర్మ
11.జస్ప్రీత్ బుమ్రా
మూడో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ లోని మూతెర స్టేడియంలో జరగబోతుంది. ఇక రెండు జట్టులకు మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. రెండో మ్యాచులో ఓడిన ఇంగ్లాండ్ మూడో టెస్టు విజయంపై కన్నేసింది.
ఇక టీంఇండియా కూడా ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టులో జోష్ మూడో టెస్టులో కూడా కొనసాగించాలని చూస్తుంది. మరోవైపు ఈ మ్యాచులో గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు బెర్త్ ఖరారు అవుతుంది.
దీనితో ఎలాగైనా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ పై విజయం సాధించాలనిఉవ్విళ్లూరుతుంది భారత్.