నాలుగవ టి20లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్ మెన్ ఇద్దరు అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఆల్ రౌండ్ షో తో విజయం సాధించింది.
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టి20 మ్యాచ్ మోటేరా స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 185 పరుగుల చేసింది. జోఫ్రా ఆర్చర్ కి నాలుగు వికెట్లు దక్కాయి. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, శ్యామ్ కరణ్ లు తలో ఒక వికెట్ పడగొట్టారు.
థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయం :
ఈరోజు మ్యాచ్ లో థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు మొదట్లోనే గట్టి షాక్ తగిలింది, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగి వెళ్లాడు. అనంతరం పిచ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, వచ్చి రావడంతోనే మొదటి బాల్ నే భారీ సిక్స్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఆ షాట్ మాత్రం సూర్య కుమార్ యాదవ్ చాలా అద్భుతంగా కొట్టాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 2 ఫోర్లు కొట్టగా, రాహుల్ ఒక ఫోర్ కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 45 పరుగులు చేసింది. ఆ తర్వాత బెన్ స్టోక్స్ వేసిన స్లోయర్ బాల్ కి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ మొదటి మూడు టి20 లు కలిపి కేవలం ఒక్క పరుగు చేశాడు, ఈరోజు మ్యాచ్లో 14 పరుగులు చేశాడు.
ఇక ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి రషీద్ బౌలింగ్లో స్టెంప్ అవుట్ గా వెనుదిరిగి వెళ్లాడు. భారీ షార్ట్ కి ట్రై చేసి స్టెంప్ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత రిషబ్ పంత్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఒక చక్కటి ఇన్నింగ్స్ ని నిలిపాడు. 14వ ఓవర్లో శ్యామ్ కరణ్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ని అద్భుతంగా అందుకున్నాడు దావీద్ మలాన్, కానీ ఆ క్యాచ్ ని ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్ గా థర్డ్ ఎంపైర్ నిర్లక్ష్యం వల్లే అవుట్ అని తెలుస్తుంది. దావీద్ మలాన్ క్యాచ్ అందుకున్నప్పటికీ బాల్ అయితే నేలకు తాకినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. దానితో సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఇక తర్వాత రిషబ్ పంత్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు రన్ రేటు తగ్గకుండా చాలా బాగా ఆడారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చినప్పటికీ పెద్దగా మెరుపులు మెరిపించ లేకపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం ఒక పెద్ద షాట్ కి ట్రై చేసి అవుట్ అవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో స్కోర్ కొంచెం నెమ్మదించింది. కానీ చివరిలో వచ్చిన శాద్దల్ ఠాకూర్ పర్వాలేదనిపించాడు. దీనితో టీమిండియా 20 ఓవర్లో 185 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ వివరాలు :
మంచి స్కోర్ తో బౌలింగ్ ని స్టార్ట్ చేసిన ఇండియా మంచి ఆరంభాన్ని రాబట్టుకుంది. భువనేశ్వర్ తన మొదటి ఓవర్ ని మేడిన్ గా ముగించాడు. తర్వాత వచ్చిన బౌలర్ హార్దిక్ పాండ్యా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మంచి స్టార్ట్ లభిస్తున్న క్రమంలో భువనేశ్వర్ బౌలింగ్లో రాయ్ ఒక్క ఫోర్ మరియు బట్లర్ ఒక్క సిక్స్ కొట్టి మంచి ఊపు మీద కనిపించారు, కానీ అదే ఓవర్లో భువనేశ్వర్ బట్లర్ ని అవుట్ చేశాడు.
ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయినప్పటికీ పవర్ ప్లే ముగిసే సమయానికి 48 పరుగులు చేసింది. ఆ తర్వాత దావీద్ మలన్ ను రాహుల్ చాహర్ 8వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాయ్ కూడా అవుటయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 50 పరుగులు చేయలేకపోతున్నా, రాయ్ ఈ మ్యాచ్ లో కూడా 40 పరుగులకె అవుటయ్యాడు.
ఇక తర్వాత బెన్ స్టోక్స్ మరియు జానీ బెయిర్‌స్టో చాలా మంచి గేమ్ ఆడారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసామంటే వాషింగ్టన్ సుందర్ని చాలా బాగా టార్గెట్ చేశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు. అతను నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు. ఇక మొదట్లో రాహుల్ చాహర్ చాలా బాగా బౌలింగ్ వేసినప్పటికీ చివరికి వచ్చేసరికి అతను కూడా ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
అప్పుడే డేంజర్ గా మారుతున్న జానీ బెయిర్‌స్టోను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. దీనితో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈరోజు మ్యాచ్లో మన స్పిన్నర్ లు కొంచెం నిరాశ పరిచిన, ఫాస్ట్ బౌలర్స్ మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఎందుకంటే మ్యాచ్ నే టర్న్ చేసే సన్నివేశాలు జరిగాయి ఈ రోజు మ్యాచ్ లో, ముఖ్యంగా 16వ ఓవర్లో ఠాకూర్ వేసిన మొదటి రెండు బాల్స్ కి రెండు వికెట్లు తీసుకున్నాడు. అవి బెన్ స్టోక్స్ మరియు మోర్గాన్ వికెట్లు.
అంతే ఒక్కసారిగా మ్యాచ్ అంతా మన వైపు కి మారింది. ఇక ఆ నెక్స్ట్ ఓవర్ లో హార్దిక్ పాండ్యా శ్యామ్ కరణ్ ను బౌల్డ్ చేశాడు. దీనితో టీమిండియా గెలుపుకి చాలా దగ్గరగా మారిపోయింది.హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండువికెట్లు తీసుకున్నాడు. ఇక భువనేశ్వర్ కూడా ది బెస్ట్ బౌలింగ్ వేశాడు. ఠాకూర్ లాస్ట్ లో తీసిన రెండు వికెట్లే ఈ మ్యాచ్ గెలవడానికి కారణం. ఇదే ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్.