ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల అన్ని దేశాలు వణికిపోతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో స్థానానికి చేరింది. అమెరికా మరియు బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఈ మహమ్మారి కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. వీటిలో అమెరికా మరియు బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, మూడు లక్షల మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆయా రాష్ట్రాలు వెల్లడించిన నివేదికల ప్రకారం దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది.

ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుతూ ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా నిత్యం 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు లక్షల లోపే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 2 లక్షల 40 వేల 842 కేసులు నమోదయ్యాయి.

ఇక మరణాల విషయానికి వస్తే, మరణాల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ముందు రోజు 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించగా, తాజాగా కరోనా వల్ల 3,741 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షల 30 వేల 132 గా ఉండి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

అమెరికాలో కరోనా వల్ల 5 లక్షల 89 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ లో కూడా కరోనా మరణాలు 4 లక్షల 48 వేలు దాటాయి. మెక్సికోలో కూడా 2 లక్షల 22వేల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోగా, బ్రిటన్లో లక్షా 27 వేల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 34 లక్షల 55 వేల మంది కరోనా తో మృతి చెందినట్లు తెలుస్తుంది.

x