మొదటి టీ20 మ్యాచ్ రివేంజ్ ను టీం ఇండియా సెకండ్ టి20 లో తీర్చుకుంది. ఇషాన్ కిషన్ మరియు విరాట్ కోహ్లీ దుమ్ము దులపడంతో సెకండ్ టి20 లో టీం ఇండియా ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ పైన, మొదటి టి20లో టీం ఇండియా ఘోర ఓటమిని చూసింది.





అయితే రెండో టి20 లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా టీంలో ఈ రోజు మార్పులు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్లు టీంలోకి చేరారు. ధావన్ మరియు అక్సర్ పటేల్ని కూర్చో పెట్టారు. ఇక ఇంగ్లాండ్ టీం లో కూడా ఒక చేంజ్ చేసారు, మార్క్ వుడ్ ప్లేసులో టామ్ కర్రన్ ను తీసుకువచ్చారు.

ఇక ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ కు రాగానే మొదటి మ్యాచ్ లో తడపడిన భువనేశ్వర్ ఈ రోజు మనకు త్వరగానే బ్రేక్ ఇచ్చాడు. బట్లర్ ను lbw చేసి వెనక్కి పంపించాడు. అయితే ఆ తరువాత కూడా ఇంగ్లాండ్ వాళ్ళు పవర్ ప్లే లో చాలా బాగా స్కోర్ చేసారు, పవర్ ప్లే ముగిసే సమయానికిన్ 44 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయారు, 9వ ఓవర్లో చాహల్ ద్రావిడ్ మలన్ ను lbw గా వెనక్కి పంపాడు, దీనితో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది.

అయితే ఆ తరువాత జాసన్ రాయ్ కొంచెం స్పీడ్ గానే ఆడటం మొదలుపెట్టాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా రాయ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. బౌండరీలతో టీం ఇండియా బౌలర్లు పై విరుచుకుపడ్డాడు, అయితే మరొకసారి సెకండ్ టి20 లో కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోకుండానే అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

భువనేశ్వర్ చాలా మంచి క్యాచ్ అందుకున్నాడు ఈ రోజు మ్యాచ్ లో, ఇక ఆ తరువాత ఒక వైపు వికెట్స్ పడతునప్పటికీ స్కోర్ అయితే బాగా వచ్చింది ఇంగ్లాండ్ టీంకి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లోనే జానీ బెయిర్‌ స్టో కూడా అవుట్ అయ్యాడు, 20 పరుగులు మాత్రమే చేశాడు. భారీ స్కోర్ అవుతుంది అని అనుకునే సమయంలో ఇండియా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. శార్దూల ఠాకూర్, భువనేశ్వర్, హార్దిక్ పాండ్య చాలా మంచి బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. లేదంటే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేది.

ఇక టీం ఇండియా ఛేజింగ్ కి దిగగానే మరో సరి నిరాశపరిచాడు, కే ఎల్ రాహుల్ ఈ రోజు మ్యాచ్ లో కూడా డక్ అవుట్ అయి వెనుతిరిగారు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నాడు, ఈ రోజు మ్యాచ్ లో 6 ఓవర్లో టామ్ కర్రన్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఒక సిక్స్ రెండు ఫోరులు బాది, టీం ఇండియా కు 50 రన్స్ ని అందించాడు.

దీనితో పవర్ ప్లే లో టీం ఇండియా మంచి స్కోర్ చేయగలిగింది. అంతే కాకుండా కోహ్లీతో కలిసి ఒక విలువైన పార్టనర్ షిప్ బిల్డ్ చేసి కేవలం 28 బంతుల్లో ఆఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు ఇషాన్ కిషన్, అయితే ఆఫ్ సెంచరీ అయిన అదే ఓవర్ లోనే lbw గా వెనుతిరిగాడు. కానీ అప్పటికే టీం ఇండియా విజయ అవకాశాలను చేతిలో పెట్టుకుంది.

ఇక ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. ఎక్కడా తడబడకుండా బాగానే ఆడాడు. ఇక తరువాత వచ్చిన రిషబ్ పంత్ కేవలం 13 బంతుల్లో 26 పరుగులు చేసి కొద్ధి సేపు మెరుపులు మెరిపించాడు. అయితే భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగి వెళ్ళాడు. ఇక ఈ రోజు మ్యాచ్ లో టీం ఇండియా క్యాప్టిన్ విరాట్ కోహ్లీ తన 26th ఫిఫ్టీ ని కంప్లీట్ చేశాడు.

కోహ్లీ ఈ రోజు 36 బంతుల్లో తన ఫిఫ్టీ ని కంప్లీట్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లుకు టీం ఇండియా బ్యాట్స్ మెన్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అలవోకగా స్కోర్ ని చేజ్ చేశారు.

ఈ రోజు మ్యాచ్ లో హైలెట్ విరాట్ కోహ్లీ మరియ ఇషాన్ కిషన్లు. ఇద్దరు చాలా బాగా ఆడారు. టీం ఇండియా, ఇంగ్లాండ్ చేసిన చేసిన 164 పరుగులను, కేవలం 17.5 ఓవర్లోనే 166 పరుగులు చేసి కంప్లీట్ చేసింది. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టి20 సిరీస్ లో ఇంగ్లాండ్ ఒకటి మరియు ఇండియా ఒకటి గెలిచారు. ఇంకా మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉంది.

x