భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరిదైన మూడో వన్డే ను గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 329 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు మాత్రమే చేసింది.

ఈరోజు జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ మరియు శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలవడంలో కీ రోల్ పోషించారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో చివరి రెండు ఓవర్లు హార్దిక్ పాండ్యా మరియు నటరాజన్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసి టీం ఇండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఇంకా ఈ రోజు జరిగిన మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ను తీసుకోండి. భారీ అంచనాల మధ్య బ్యాటింగ్కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్ మరోసారి సెంచరీ బాగస్వామ్యాని నమోదు చేశారు. రోహిత్ శర్మ 37 పరుగుల వద్ద, శిఖర్ ధావన్ 67 పరుగుల వద్ద ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అవుట్ చేశాడు. మునుపటి మ్యాచ్లో అర్థ సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ, సెంచరీ హీరో రాహుల్ ఈరోజు జరిగిన మ్యాచ్లో నిరాశపరిచారు.

ఇలాంటి దశలో రిషబ్ పంత్ మరియు హార్దిక్ పాండ్య సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. పంత్ 62 బంతుల్లో 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. చివర్లో శార్దుల్ ఠాకూర్ చెలరేగి ఆడటంతో భారత్ మరోసారి 300పైగా స్కోర్ ని సాధించండి. ఇంగ్లాండ్ బౌలర్స్ అందరు ఒక వికెట్ చొప్పున దక్కించుకుంటే, మార్క్ వుడ్ మూడు వికెట్లు, అదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టారు.

330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును ప్రారంభంలోనే భువనేశ్వర్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 28 పరుగులకే తమ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బెన్ స్టోక్స్ కాస్త భయపెట్టిన 34 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. డేవిడ్ మలన్ మాత్రం ఓపికగా ఆడి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 పరుగుల వద్ద డేవిడ్ మలన్ ను శార్దూల్ ఠాగూర్ అవుట్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు అంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

అయితే ఎనిమిదో స్థానంలో వచ్చిన శ్యామ్ కరణ్ అదిల్ రషీద్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాని నెలకొల్పాడు. శ్యామ్ కరణ్ ఒంటిచేత్తో మ్యాచ్ ను భారత్ చేతిలో నుంచి లాక్కునే ప్రయత్నం చేశాడు. ఒకానొక దశలో భారత్ ఓడి పోతుందేమో అని అందరూ అనుకున్నారు. అయితే సరిగ్గా అలాంటి సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టి అదిల్ రషీద్ ను అవుట్ చేశాడు.

ఇంకా ఈ మ్యాచ్ లో శ్యామ్ కరణ్ 83 బంతుల్లో 95 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను సిరీస్ గెలిపించే అంత పని చేశాడు. కానీ చివరకు ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. టీమిండియా ఫీల్డింగ్ సమయంలో హార్దిక్ పాండ్యా మరియు ఠాగూర్ సులభమైన క్యాచ్ లు నేలపాలు చేశారు. అయితే కోహ్లీ పట్టిన అదిల్ రషీద్ క్యాచ్, హార్దిక్ పాండ్య పట్టిన మోయిన్ అలీ క్యాచ్ ఈ మ్యాచ్ కి హైలెట్ గా నిలిచాయి. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు నటరాజన్ ఒక వికెట్ తీశారు.

x