టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా ఫైనల్స్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. ఫురుషుల 57 కేజీల విభాగంలో రవి కుమార్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సెమీ ఫైనల్ సమయంలో, అతని ప్రత్యర్థి నురిస్లామ్ సనయేవ్ (కజకిస్థాన్) అతడిని గట్టిగా కొరికాడు కానీ, రవి కుమార్ తన ఆటను కోల్పోలేదు.

మ్యాచ్ జరుగుతున్న చివరి సమయంలో రవి కుమార్ పట్టుకి బిత్తరపోయిన నురిస్లామ్ సనయేవ్.. క్రీడాస్ఫూర్తి నిబంధనలకు పూర్తీ విరుద్ధంగా ప్రవర్తించాడు. దీంతో అతని పట్టు నుంచి బయట పడటానికి రవి కుమార్ చేతి కండని గట్టిగా కొరికాడు. రవి కుమార్ వెంటనే రిఫరీకి ఫిర్యాదు చేశాడు. అయితే, చివరికి రవి కుమార్ గేమ్ గెలిచాడు. ప్రస్తుతం అతను రవి కుమార్ చేతిని కొరికిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రవి కుమార్ దహియా ఫైనల్ మ్యాచ్ ఆడగలడా.. లేదా.. అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. కానీ, భారత రెజ్లర్ బాగానే ఉన్నారని అతని సహాయక సిబ్బంది ధృవీకరించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి కుమార్ దహియా నిలిచాడు. హర్యానా కు చెందిన ఈ రైతు బిడ్డ పసిడి పతకం గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

image source

x