తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన గ్రేడ్స్ ప్రకారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు గ్రేడ్ లు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

కరోనా రెండొవ దశ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ చాలా కష్టతరంగా మారింది. వాస్తవానికి జులై 15 తర్వాత ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ కొద్ది రోజుల క్రితం తమ అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడించింది. కేంద్రం మొన్న ఈ మధ్య సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో తెలంగాణ స‌ర్కార్ కూడా మరుసటి రోజే టెన్త్, ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు చేయచ్చని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి.

x