భారతరత్న పురస్కారం అందుకున్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు కు అంతర్జాతీయ పురస్కారం వరించింది. రసాయనిక శాస్త్రంలో ఆయన ఒక లెజెండ్రీ సైంటిస్ట్. ఆయన కు పునరుత్పాదక ఇంధన వనరుల పై చేసిన పరిశోధనలకు గాను ఇంటర్నేషనల్ ఎన్ని అవార్డ్ – 2020 లభించింది. ఎనర్జీ రీసెర్చ్ లో ఈ పురస్కారాన్ని నోబెల్ బహుమతి గా పరిగణిస్తారు. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 14న రోమ్ లోని క్విరినల్‌ ప్యాలెస్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఆయన కు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా హాజరవుతున్నాడు. ఈ పురస్కారం కింద సీఎన్ఆర్ రావు కు నగదు బహుమతితో పాటు ఒక గోల్డ్ మెడల్ ను అందజేయనున్నారు.

x