CSK vs SRH మ్యాచ్ హైలైట్స్ :
ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ విజయం సాధించింది. హైదరాబాదు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని చేధించి చెన్నై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే వార్నర్ ఈ రోజు మ్యాచ్ లో రెండు విషయాల్లో నిరాశపరిచాడు.
మొదటిది పిచ్ పైన తేమ ఉంటుందని తెలుసు కూడా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత స్పీడ్ గా ఆడకుండా నెమ్మదిగా ఆడారు. వార్నర్ కంటే మనీష్ పాండే కొంచెం పర్వాలేదని చెప్పవచ్చు. భారీ స్కోరు సాధించాల్సిన మ్యాచ్లో చాలా నెమ్మదిగా ఆధారంతో స్కోర్ బోర్డ్ తగ్గుతూ వచ్చింది.
మిడిలార్డర్లో విలియం సన్ వికెట్ ఉన్నాకూడా వార్నర్ మరియు మనీష్ పాండే ఎందుకు అంతా నెమ్మదిగా ఆడారు అర్థం కాలేదు. దీంతో భారీ స్కోరు చేయాల్సిన పిచ్ పై హైదరాబాద్ జట్టు కేవలం 171 పరుగులు మాత్రమే చేసింది. అలా వార్నర్ హైదరాబాదు ఓటమికి కారణమయ్యాడు .
SRH బ్యాట్టింగ్ హైలైట్స్ :
టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు మొదట్లోనే బైర్ స్టో వికెట్ను తొందరగానే కోల్పోయింది. మరో ఓపెనర్ వార్నర్ మనీష్ పాండే తో కలిసి చక్కటి పార్టనర్ షిప్ ను నెలకొల్పారు. ఇదే క్రమంలో వీరిద్దరూ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు.
ఇద్దరు రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 18వ ఓవర్ లో చెన్నై బౌలర్ లుంగీ ఎంగిడీ వాళ్ళిద్దర్నీ అవుట్ చేశాడు. 18వ ఓవర్ ముగిసే సరికి 134 పరుగుల వద్ద ఉన్న హైదరాబాద్ జట్టు తర్వాత మిగిలిన రెండు ఓవర్లలో 37 పరుగులు చేసిందంటే అది కేన్ విలియమ్ సన్ మహిమే.
విలియమ్ సన్ చివర్లో 267 స్ట్రైక్ రేటు తో చెలరేగి ఆడటంతో హైదరాబాద్ 171 పరుగుల స్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 57 పరుగులు చేయగా, మనీష్ పాండే 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. విలియమ్ సన్ 10 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇక కేదార్ జాదవ్ కూడా చివర్లో 4 బంతుల్లో 12 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడీ 2 వికెట్లు, శ్యామ్ కరణ్ ఒక వికెట్ తీశారు.
CSK బ్యాట్టింగ్ హైలైట్స్ :
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ మరియు గైక్వాడ్ మొదటి బంతి నుంచి హైదరాబాద్ బౌలర్ల పై ఆధిపత్యాన్ని కొనసాగించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్ కు 129 పరుగులు జోడించాడు.
ఆ తర్వాత గైక్వాడ్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు, తర్వాత ఓవర్లో రషీద్ ఖాన్ మొయిన్ అలీ ను మరియు డూప్లెస్ వికెట్లు తీసేసాడు. రవీంద్ర జడేజా సురేష్ రైనా తో కలిసి మిగతా పని పూర్తి చేశారు. డుప్లెసిస్ 38 బంతుల్లో 56 పరుగులు చేయగా, గైక్వాడ్ 44 బంతుల్లో 75 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 7 పరుగులతో, సురేష్ రైనా 17 పరుగులతో నాటౌట్గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.