ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ఉత్తర్వులపై వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఈ జీవో ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రతిపక్షా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ టీచర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ జీవో పై మరింత వ్యతిరేకత మొదలైంది.

ఈ సంఘటన ఆదివారం భీంగల్ మండలం, బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బేతాళ సరస్వతి (35) అనే మహిళా బాబాపూర్ గ్రామంలో ఎస్జీటీగా పని చేస్తూ ఉండేది. అయితే, ఇటీవల ఆమెను బదిలీల్లో భాగంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరస్వతి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అసలు జీవో నంబర్ 317 అంతే ఏంటి?

జీవో నంబర్ 317 ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులను కేటాయించే విధివిధానాలను చూసినట్లయితే, ఉద్యోగుల ఆప్షన్ ఫార్ములాను సీనియార్టీ ప్రకారం పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లాల్లో ఉన్న సీనియార్టీ జాబితా ప్రకారం వారు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత జిల్లాను వారికీ కేటాయిస్తారు. ఆ సీనియార్టీ జాబితాలో మొదటిగా ప్రాధాన్యత వర్గంలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ప్రకారం సీనియార్టీ తో సంబంధం లేకుండా మొదటి వారికే కేటాయిస్తారు.

ఈ జీవో వల్ల జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించి సమస్యలు ఏమి ఉండవు. జిల్లా క్యాడర్ కు సంబంధించి తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. స్థానికతను పట్టించుకోకుండా క్యాడర్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం వల్ల దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల భార్య ఓ జిల్లాలో భర్త మరో జిల్లాలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ కేటాయింపు పద్ధతిని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం 32 జిల్లాల పరిధిలో 95 వేల మంది టీచర్లు ఉంటే కేవలం 10 వేల మంది వారికే కొత్త జిల్లాలకు వెళ్తారని ప్రభుత్వం భావించింది. కానీ ఇపుడు 22,500 పైగా టీచర్ల కొత్త జిల్లాలకు బదిలీ కావడంతో సమస్య మరింత పెరిగింది.

x