MI vs DC మ్యాచ్ వివరాలు..
ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఈరోజు చెన్నై స్టేడియం లో జరిగింది. ఢిల్లీ క్యాపిటల్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టును ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగి ఆడటంతో ఢిల్లీ జట్టు ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్లో బ్యాటింగ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ అదరగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ మైదానంలోకి అడుగు పెట్టలేదు. దీంతో పొలార్డ్ కెప్టెన్గా బాధ్యతలను తీసుకున్నాడు. దీంతో మైదానంలో రోహిత్ కెప్టెన్సీ యొక్క మ్యాజిక్ మిస్ అయ్యింది. రోహిత్ బౌలర్స్ ను అద్భుతంగా ఉపయోగించుకుంటాడు, కెప్టెన్గా అద్భుతాలు చేస్తాడు. కారణాలు తెలియవుగాని రెండో ఇన్నింగ్స్లో రోహిత్ కెప్టెన్సీ చేయలేదు. రోహిత్ కెప్టెన్సీ చేయకపోవటమే ముంబై ఓడిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. రోహిత్ కనుక కెప్టెన్సీ చేసి ఉంటే ముంబై మ్యాచ్ గెలిచేది అని పేర్కొంటున్నారు.
మొదటి ఇన్నింగ్స్:
ఇక హైలెట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ను తీసుకుంది. మొదట్లో ముంబై ఇండియన్స్ జట్టు బాగానే ఆడుతున్నరు అని అనుకుంటే మ్యాచ్ సాగే కొద్దీ చెత్త షార్ట్స్ ఆడి ముంబై బ్యాట్ మేన్స్ వికెట్లు చేజార్చుకున్నారు. 9 పరుగుల వద్ద డికాక్ వికెట్ కోల్పోయిన ముంబై జట్టును రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ కాపాడే ప్రయత్నం చేశారు. 15 బంతుల్లో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఒక చెత్త షాట్ ఆది అవుటయ్యాడు. కొద్దిసేపటికే రోహిత్ శర్మ 30 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఒక్క ఇషాన్ కిషన్ మరియు జయంతి యాదవ్ తప్ప మిగిలిన వారు ఎవరు కనీస పరుగులు కూడా సాధించలేదు. ఫలితంగా ముంబై జట్టు 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ల అమిత్ మిశ్ర నాలుగు వికెట్లు తీయగా, ఆవేశఖాన్ రెండు వికెట్లు, మార్కస్ స్టోఇనిస్, రబడా, లలిత్ యాదవ్ ఒకొక్క వికెట్ తీశారు.
రెండో ఇన్నింగ్స్:
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఏ మాత్రం తొందర పడకుండా ఆచితూచి పరుగులు తీస్తూ లక్ష్యానికి చేరుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 42 బంతుల్లో 45 పరుగులు చేయగా స్టీవెన్ స్మిత్ 29 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు అవుట్ అయినప్పటికీ లలిత యాదవ్ చివరకు గ్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. లలిత్ యాదవ్ 25 బంతుల్లో 22 పరుగులు, హెట్మేరు 9 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ముంబై బౌలర్స్ లో బూమ్రా, కిరణ్ పోలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చహర్ ఒకొక్క వికెట్ తీశారు.