సారా టెండూల్కర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఆమె క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ గారి కుమార్తె. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ.. నెటిజన్లలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.
ఇంస్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు వన్ మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె క్రమం తప్పకుండా తన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. సారా ఫోటోలు చుసిన వారు ఎవ్వరైనా ఆమె బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాదని చెబుతారు.
సారా టెండూల్కర్ త్వరలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రీడాకారుల కుమార్తలు బాలీవుడ్లోకి రావటం కొత్త విషయం కాదు. గతంలో ప్రకాష్ పడుకోనె గారి కుమార్తె దీపికా పడుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఒక స్టార్ హీరోయిన్. కానీ, 23 ఏళ్ల సారా టెండూల్కర్ అదే మార్గాన్ని ఎంచుకుంటుందో లేదో చూడాలి.