DC vs PBKS మ్యాచ్ హైలైట్స్ :

ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్య సాధనలో 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్లో పంజాబ్ తీసుకున్న ఒక నిర్ణయం ఆ జట్టును నిండా ముంచేసిందని అని చెప్పవచ్చు. కె.ఎల్.రాహుల్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ స్థానంలో డేవిడ్ మలన్ ను తీసుకున్నారు. ప్రభ్ సిమ్రాన్ ను మయాంక్ అగర్వాల్కి ఓపెనర్ ప్లేయర్గా తీసుకున్నారు.

మయాంక్ అగర్వాల్కి ఓపెనర్ ప్లేయర్గా గేల్ లేదా డేవిడ్ మలన్ ఎవరైనా ఒకరు దిగి ఉంటే బాగుండేది. అలా కాకుండా తరచు విఫలమవుతున్న ప్రభ్ సిమ్రాన్ను దింపి పంజాబ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. మయాంక్ అగర్వాల్కి ఓపెనర్ ప్లేయర్గా గేల్ లేదా మలన్ వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ ఓపెనర్గా వచ్చిన చాలా బాగుండేదని, పంజాబ్ భారీ స్కోరు చేసేదని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

PBKS బ్యాట్టింగ్ హైలైట్స్ :

ఇక ఈ రోజు హైలెట్స్ విషయానికి వస్తే కెప్టెన్ బాధ్యతలను తీసుకున్న. మయాంక్ అగర్వాల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న మయాంక్ అగర్వాల్ మాత్రం చాలా సేపు ఓపికగా ఫ్రిజ్ లో ఉన్నారు. మధ్యలో డేవిడ్ మలన్ నుంచి అతనికి కొద్దిపాటి సహకారం లభించింది. ఆ ఒక్కటి మినహాయిస్తే పంజాబ్ జట్టులో ఏ ఒక్కరూ కనీస స్కోర్ సాధించలేడు.

డేవిడ్ మలన్ 26 బంతుల్లో 26 పరుగులు సాధించాడు. తర్వాత చివరి వరకు నిలబడి మయంగా అగర్వాల్ 58 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ల లో రబడా మూడు వికెట్లు తీయగా, ఆవేశ ఖాన్, అక్షర్ పటేల్ చేరొక వికెట్ తీశారు.

DC బ్యాట్టింగ్ హైలైట్స్ :

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోరు 63 పరుగులు వద్ద ఉండగా పృథ్వీ షా 22 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత దిగిన స్మిత్ కొద్దిసేపు శిఖర్ ధావన్ కు అండగా నిలిచాడు.

స్మిత్ కొద్దిసేపు తర్వాత 22 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శేఖర్ ధావన్ మాత్రం చివరి వరకు పిచ్లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ధావన్ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లు లో క్రిస్ జోర్డాన్, హర్దీప్ బ్రార్, రిలే మెరెడిత్ తలొక వికెట్ తీశారు.

x