ఆది పురుష్ పట్టాభిషేకం, ప్రభాస్ శ్రీ రాముడు పాత్రలో రానున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆది పురుష్. అది దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి త్వరలో ఒక అదిరిపోయే అప్ డేట్ వస్తుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. అది ఏమిటంటే శ్రీరామనవమి స్పెషల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే ఎలాంటి లుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచిస్తున్న టీం మేకర్స్ కు ఓం రౌత్ ఒక మంచి ఐడియాను ఇచ్చారు అంతా. ఆ ఐడియా ఏమిటంటే రాముని పట్టాభిషేకం జరిగే సందర్భంలోని స్టీల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ స్టిల్ రిలీజ్ అయితే పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అయినట్టే. ఇక ఈ సినిమా కోసం చాలా మంది భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ సీత గా నటిస్తుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.