కరోనా రెండవ దశ తగ్గుముఖం పడుతుందని, రికవరీ రేటు పెరుగుతుందని ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా కేసులు భారీగా తగ్గుతున్నాయి ఇదే సమయంలో అంతర్జాతీయ నిపుణులు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో 30 లక్షల మంది పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనితో సర్కార్ ఈ ముప్పును ఎదుర్కోవడం పై దృష్టి సాధించండి. రాష్ట్రంలో 6 నుంచి 8 వేల మంది చిన్నారులు ఐసియులో చికిత్స పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో ఒక్క శాతం చిన్నారులకు ప్రమాదకరమైన “మల్టీ సిస్టం ఇన్ ప్లమేటరీ సిండ్రోమ్” ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సర్కార్ ప్రభుత్వం ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తుంది. చిన్నారులకు ఏ కష్టం వచ్చినా హైదరాబాద్లోని నీలోఫర్ లేదా గాంధీ హాస్పటల్స్ కు వెళ్లాల్సి ఉంది. బోధన హాస్పటల్స్ మినహా జిల్లాల్లో అయితే ప్రత్యేకంగా పిల్లల వార్డులు లేవు. దీంతో ఎక్కువగా ప్రైవేట్ హాస్పటల్స్ పై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వ రంగంలో పిల్లల పడగలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా హాస్పటల్స్ లో కూడా పిల్లల వైద్యానికి అవసరమైన పడకల సంఖ్యను పెంచబోతున్నారు.
గత ఏడాదిన్నర రాష్ట్రంలో తొలి మరియు రెండవ దశలో 81,967 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ రెండు దశల్లోనూ పిల్లలు ఒక్క శాతం కూడా హాస్పటల్స్ లో ప్రమాదకరమైన స్థితిలో చికిత్స పొందలేదని వైద్య వర్గాలు విశ్లేషించాయి. అయితే జూన్, ఆగస్టు మధ్య ప్రమాదకరమైన మల్టీ సిస్టం ఇన్ ప్లమేటరీ సిండ్రోమ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
సుమారు 1000 నుంచి 1200 వరకు ఈ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తుంది. 30 లక్షల మంది చిన్నారులు కోవిద్ బారినపడిన ఇందులో 24 లక్షల మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలోనూ ఎక్కువుగా ఐసియులో చికిత్స పొందాల్సిన అవసరం పడేవారు సుమారు 6 వేల నుంచి 8 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తుంది.
ఇంత మంది పిల్లలకు ఐసియు సేవలు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సాధ్యమైనంతవరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యాప్తిని ముందుగానే నియంత్రించాలనే వ్యూహాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది. చిన్నారులకు అవసరమైన మందులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపడుతుంది తెలంగాణ సర్కార్.