యంగ్ టైగర్ NTR వరస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కొమరం బీమ్ పాత్రలో NTR గారు నటిస్తున్న సంగతి మనకు తెలిసేందే.
ఈ సినిమా తర్వత NTR మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ గారి దర్సకత్వంలో యాక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాకు ”అయినను పోయిరావలె హస్తినకు” అనే పేరు అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని NTR కోసం వెయిట్ చేస్తున్నాడు.
త్రివిక్రమ్ సినిమా తర్వాత NTR ఎవరి దర్శకత్వంలో చేస్తారో క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ విషయం పై వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులుగా ప్రశాంత్ నీల్, అట్లీ కుమార్, లోకేష్ కనకరాజు, ఇలా చాల మంది పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో వార్త హల్చల్ చేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం తరువాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారంట. ఈ క్రమంలో ఇండో అమెరికన్ దర్శకుడితో సంప్రదింపులు జరిపారని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ సినిమాలో ఎన్టీఆర్ అని అనుకున్నారని మూవీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇతడు ఇప్పటికే హాలీవుడ్ లో చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించాడు. అందులో అన్బ్రేఅకల్, స్ప్లిట్, ఆఫ్టర్ ఎర్త్, ది సిక్స్త్ సెన్స్, గ్లాస్, సినిమాలు ఉన్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇది నిజం కావాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.