ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కు మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది.
మరో వైపు మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, మరియు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, ప్రస్తుతం వారందరు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సినీనటి ఇషా చావ్లా కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఆమె ‘ప్రేమ కావాలి’ అనే చిత్రం తో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత బాలయ్యతో కలిసి శ్రీమన్నారాయణ అనే సినిమాలో నటించింది. సునీల్ తో పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు అనే సినిమాలో నటించింది. అలాగే జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కబీర్ లాల్ దర్శకత్వంలో ‘దివ్య దృష్టి’ అనే సినిమాలో నటిస్తోంది.
ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. అందరు కనీస దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరు క్షేమంగా ఉండాలని చెప్పుకొచ్చింది. త్వరలోనే కరోనా నుంచి బయటపడి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పుకొచ్చింది.